మానేటి న్యూస్ జగిత్యాల నవంబర్ 19
నవంబర్ మధ్యలో, సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఘోర రోడ్ ప్రమాదంలో శ్రీ సుతారి ధర్మయ్య రాయికల్ వాసి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుఃఖకర సంఘటన ఆయన కుటుంబానికి తీవ్రమైన దుఃఖాన్ని కలిగించింది.
SATA రియాద్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, సౌదీ అంబాసడీతో సమన్వయం చేసి, కంపెనీ HR మేనేజర్ సహాయంతో హైదరాబాద్ నుండి ధర్మయ్య కుటుంబానికి సంబంధించిన అంత్యక్రియల వరకు అన్ని ఏర్పాట్లను చూసుకున్నారు. బాధిత కుటుంబానికి ఉచిత అంబులెన్స్, సంబంధిత అధికారులతో సమన్వయం మరియు ఇతర అవసరాలు సముచితంగా అందించబడ్డాయి.
SATA కోర్ టీమ్ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తోంది. ఈ సహాయ సహకారలో పాల్గొన్న GWAC బృందనికి ధన్యవాదలు.
సాటా రియాద్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చను సాటా కోర్ టీం సభ్యులు మల్లేశన్, శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, సునీతఅవినాష్, ముదిగొండ శంకర్, మహ్మద్ నూరుద్దీన్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, దూడం సంజీవ్, పళ్ళికొండ సంజీవ్, సింగూ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, యోగేష్ బాబు, మురళీ క్రిష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), ఫణి కుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీ చరణ్, మహమ్మద్ కమిల్ తదితరులు అభినందనలు తెలియజేశారు.