X

జలదిగ్బంధంలో రేకొండ గ్రామము నాలుగు పాడి పశువులు మృతి వందల ఎకరాల్లో పంట నష్టం..

మానేటి న్యూస్ అక్టోబర్ 30 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్.!

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం, రాత్రి కురిసిన అకాల వర్షానికి , జలదిగ్బంధంలో రేకొండ గ్రామం. ఏరుకొండ రమేష్ అనే రైతువి ఐదు లక్షల రూపాయల విలువ చేసే పాడి పశువులు, పశువుల కొట్టం, వరద తాకిడికి కొట్టుకపోవడముతో కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. ఆర్థిక సహాయం చేసీ, రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘ, నాయకులు, ప్రభుత్వాన్ని, కోరుతున్నారు. వర్ష బీభత్సానికి రేకొండ గ్రామంలో అపార నష్టం వాటిలింది, వందల హెక్టార్లు చేతుకొచ్చిన వరి పంట నీట మునగడంతో, లబోదిపోమంటున్నా రైతులు, గుర్రాల మహేందర్ రెడ్డి అనే రైతు రెండు ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట వర్షతాకిడికి నీట మునిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. రేకొండ సెక్రటరీ గోదారి అజయ్ కుమార్ సహాయక చర్యలు చేపడుతూ, వరద తాకిడికి వాగులు ఉదృతంగా ప్రవహించడంతో అక్కడ సిగ్నల్స్ పెట్టి ప్రయాణికులను అటు వెళ్లకుండా చూశారు. రేకొండ మత్తడి ప్రవహించే ప్రదేశంలో పిచ్చి మొక్కలను, చెట్లను, పుక్లింగ్ సహాయంతో తొలగించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని, ఇరువైపులా తాడు కట్టి ,తాడు సహాయముతో గ్రామస్తులు దాటే విధంగా చూడాలని గ్రామస్తులు, సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు.రేకొండ గ్రామం నుండి ,బొమ్మనపల్లి మీదుగా, హుస్నాబాద్ వెళ్లాలంటే రేకొండ మత్తడి ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి, రేకొండ నుండి, మొగిలిపాలెం ,మీదగా కరీంనగర్ వెళ్లాలంటే రేకొండ వాగు దాటనివ్వకపోవడంతో, కరీంనగర్ వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు, రేకొండ నుండి ఎగ్లాస్పూర్ మీదుగా, హుజురాబాద్ వెళ్లాలంటే తొక్కుడు బండల వాగు ఉదృతంగా ప్రవహించడంతో బావుల కాడికి వెళ్లే రైతులకు, ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని, గత 30 సంవత్సరాల నుండి వర్షం కురిసినప్పుడు తొక్కుడు బండల వాగు దాటిని వ్వకపోవడంతో నాన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలియజేశారు. వరద ఉదృతి తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ,తొక్కుడు బండలు,పాకూరు పట్టి జారడంతో, ప్రయాణికులు రైతులు, తొక్కుడు బండల వాగు మీద జారిపడి కాళ్లు, చేతులు, విరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కుడు బండల వాగు పైన బ్రిడ్జి నిర్మించి, ప్రమాదాలను అరికట్టాలని, రేకొండ గ్రామస్తులు, ప్రయాణికులు, రైతులు, కంతాల సంజీవ రెడ్డి, చంచల సంపత్ , చంచల వీరయ్య, కాంతాల.లక్షమారేడ్డి,చెంచాల మల్లయ్య, మంత్రి పొన్నం ప్రభాకర్ కు, విజ్ఞప్తి చేస్తున్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post