కుమార్ మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/
• జమ్మికుంట మండల అధ్యక్షులుగా ఆకారం పాపయ్య, ఉపాధ్యక్షులుగా మల్లాడి మల్లారెడ్డి..
• జమ్మికుంట పట్టణ అధ్యక్షులుగా వాసం వెంకటేష్..
• వీణవంక మండల అధ్యక్షులుగా మండల రాజు..
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి ఇటికాల స్వరూప అధ్యక్షతన జమ్మికుంట పట్టణంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు అందించారు. సంస్థ విధి విధానాల తెలుపుతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని విద్యావంతులు, మేధావులకు పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల రాజేశం, పులి అరవింద్ రెడ్డిలతో కలిసి పలు నియామకాలను అందించారు. జమ్మికుంట మండల అధ్యక్షులుగా ఆకారం పాపయ్య, ఉపాధ్యక్షులుగా మల్లాడి మల్లారెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులుగా వాసం వెంకటేష్, వీణవంక మండల అధ్యక్షులుగా మండల రాజకుమార్ తదితరులకు నియామకాలు అందించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల అధ్యక్షురాలు తాళ్లపల్లి దేవేంద్ర, ఉపాధ్యక్షురాలు జంపాల సువర్ణ, పట్టణ అధ్యక్షురాలు మల్లెల సరిత, జమ్మికుంట మండల నాయకులు గూడెపు లలిత, హేమలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన సభ్యులు మాట్లాడుతూ సంస్థ విధివిధానాలకు అనుగుణంగా నీతి నిజాయితీగా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు.