మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 28/

జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూ. 62.50 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. పట్టణ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.ముఖ్యాంశాలు:జగిత్యాల మున్సిపాలిటీకి రూ.62.50 కోట్ల నిధులురూ.140 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయిమూడు జాతీయ రహదారులు మంజూరుమాస్టర్ ప్లాన్ ద్వారా సమగ్ర విస్తరణసీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలుఎమ్మెల్యే మాట్లాడుతూ, “2023లోనే సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల అభివృద్ధి పనుల కోసం వినతిపత్రం సమర్పించాను. అదే రోజు సీఎం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ చివరి వారంలో రూ. 32 కోట్లు విడుదల కావడంతో డ్రైనేజీ, కరెంట్, రోడ్ల వంటి పనులు ప్రారంభించాం,” అని తెలిపారు.అమృత్ పథకం కింద తాగునీటి సరఫరా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేసినట్లు తెలిపారు. దీపావళి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మరలా కలిసి మరిన్ని అభివృద్ధి నిధులు కోరగా రూ. 62 కోట్ల పైన నిధులు ఆమోదించారని తెలిపారు.జగిత్యాల పట్టణ విస్తీర్ణం పెరిగేందుకు ధరూర్, తిప్పన్నపేట్, లింగంపేట్, హస్నాబాద్ మోతే, టీఆర్‌నగర్, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలు కలపడం ద్వారా ప్రభుత్వ స్థలాలు పెరిగాయని వివరించారు. రైతులకు నష్టం లేకుండా, భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.“వచ్చే ఎన్నికల కోసం కాదు, వచ్చే తరాల కోసం పని చేయాలి. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై ప్రజల సూచనలు తీసుకుంటాం. ప్రజల భాగస్వామ్యంతోనే జగిత్యాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది,” అని ఎమ్మెల్యే అన్నారు.జిల్లా కేంద్రంగా మూడు జాతీయ రహదారులు మంజూరు అయ్యాయి, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. రూ. 140 కోట్లతో జరుగుతున్న పట్టణ అభివృద్ధి పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తవుతాయి అని తెలిపారు.అక్రమంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాల అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్‌లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు బాలే శంకర్, డిష్ జగన్, కుసరి అనిల్, చెట్పల్లి సుధాకర్, గుర్రం రాము, చందా పృథ్వీ, పిట్ట ధర్మరాజు, జంబర్తి రాజ్‌కుమార్, అహ్మద్, ప్రవీణ్ రావు, పోటునుక మహేష్, రంగు మహేష్, పవన్, తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply