X

జగిత్యాలలో జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు..

మానేటి న్యూస్ జగిత్యాల నవంబర్ 19

జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద స్టేడియంలో ఈ నెల 23వ తేదీ (ఆదివారం) రోజున మధ్యాహ్నము  12  గంటలకు జూనియర్ మరియు సీనియర్ విభాగాల జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఇట్టి సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొని వారు ఆధార్ కార్డ్ తమ వెంట తీసుకురావాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

  > సీనియర్ మెన్స్ విభాగం:
పాల్గొనేవారి బరువు 85 కిలోల లోపు ఉండాలని & ఉమెన్స్ విభాగంలో పాల్గొనే వారి బరువు 75 కిలోల లోపు ఉన్నవారు పాల్గొనవచ్చునని ఎంపికైన క్రీడాకారులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో


  డిసెంబర్ 11,12,13,14 తేదీలలో  నిర్వహించబోయే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారు.

> 🔹 జూనియర్ బాలుర విభాగం:
పాల్గొనబోయే క్రీడాకారులు 75 కిలోల లోపు బరువు కలిగి, 18-01-2006 తర్వాత జన్మించిన వారు కావాలి.
ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

> 🔹 జూనియర్ బాలికల విభాగం:
పాల్గొనేవారు 65 కిలోల లోపు బరువు కలిగి, 31-12-2005 తర్వాత జన్మించిన వారు కావాలి.
ఎంపికైన క్రీడాకారిణులు డిసెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

ఈ వివరాలను రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సిహెచ్ సంపత్ రావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్  అధ్యక్షులు కుర్మా సుదర్శన్ రెడ్డి , జిల్లా సెక్రటరీ  రఘుపతి నాయక్   మరియు  సభ్యులు వెల్లడించారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post