భీమదేవరపల్లి నవంబర్ 19(మానేటి న్యూస్):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 108 వ జయంతి వేడుకలను ముల్కనూర్ అంబేడ్కర్ కూడలిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టెంపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు.ఈ సందర్బంగా ఐలయ్య మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా ఇందిరమ్మ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.పేద ప్రజలకు అండగా నిలవడంతో పాటు, మహిళా సాధికారిత కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.ఆమె పాలనలో బడుగు,బలహీన వర్గాలకు మేలు జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయ మాజీ ఛైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు చిదురాల స్వరూప, పత్తిపాక కొమురెల్లి, జిల్లా నాయకులు పచ్చునూరి కరుణాకర్, వల్లెపు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.