
అక్కన్నపేట, నవంబర్ 19, ( మానేటి న్యూస్):
భారత దేశ మాజీ ప్రధాని ఉక్కు మహిళా శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా అక్కన్నపేట మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్టా లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగపెల్లి ఐలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంగపెల్లి ఐలయ్య పార్టీ శ్రేణులతో కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహనీయురాలు రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన భారత దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ అని అన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు.గరీబి హఠాహో.. నినాదంతో పేదరిక నిర్మూలన కు విశేష కృషి చేసిన ఉక్కు మహిళ.20 సూత్రాల పథకాలతో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన దిశాలి..ఆమె శక్తి ధైర్య సాహసాలతో ప్రతిపక్షాల చేత కూడా దుర్గామాతగా కీర్తింపబడిన ఉక్కు మహిళ భారత దేశ మొదటి మహిళా ప్రధాని దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత… భారతరత్నస్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాము, లింగంపల్లి సారయ్య, బందరం రాజయ్య, బెజ్జంకి సారయ్య, మోహన్ నాయక్, సామి రెడ్డి,చింతల బాలరాజ్, పులికాసి రమేష్,వల్లపు పరశురాములు,ధరవత్ తిరుపతి నాయక్,అనిల్ కుమార్, నందవరం సంపత్, పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.