X

గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి,వొడితల ప్రణవ్..

పాడి పంటలతో  గ్రామంలో విరసిల్లాలి..

గ్రామ దేవతలుగా,కొలుచుకొనే  భూలక్ష్మి,మహాలక్ష్మి, బొడ్రాయిని ప్రతిష్టించడం వల్లన గ్రామంలో ఎలాంటి ఆటంకాలు రావనేది మన నమ్మకం.

కమలాపూర్, జోజునూరు, గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వోడితల ప్రణవ్..

సాగర్ మానేటి ప్రతినిధి కమలాపూర్/


  హనుమకొండ జిల్లా,కమలాపూర్ మండల జోజునూరు గ్రామం లో,
   శ్రీ అభ్యయాజనేయస్వామి సాహిత గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము
   భూలక్ష్మి,మహలక్ష్మి,బొడ్రాయి,సహిత పోచమ్మ తల్లుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు,అనంతరం.
   గ్రామంలోని శ్రీ అభ్యయాజనేయస్వామి
ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఊరిని కంటికి రెప్పలా కాపాడుకునే గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమపూజలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని,గ్రామంలోని ప్రజలందరూ పండగకు రావడం వలన గ్రామమంతా సందడిగా ఉందని అన్నారు.
    శ్రమ తీసుకుని ఇంతటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.ప్రతిష్ఠ మహోత్సవానికి తనవంతు సహకారాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో  గ్రామశాఖ కాంగ్రెస్ నాయకులు, కమలాపూర్ మండల నాయకులు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post