• అర్బన్ బ్యాంకు సభ్యుల నుంచి అనూహ్యా మద్దతు.. జగిత్యాల లో విస్తృత ప్రచారం..
మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 28/


కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఘనవిజయం సాధించే దిశగా రోజురోజుకు బ్యాంకు సభ్యుల నుంచి అనుహ్యా మద్దతు లభిస్తోంది. వెలిచాల మద్దతిస్తున్న ప్యానల్ గెలుపుతోనే అర్బన్ బ్యాంకు మహర్దశ లభిస్తుందని సంఘీభావం ప్రకటిస్తున్నారు. ప్యానల్ అభ్యర్థులకు కచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు స్వయంగా ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. నీతిమంతంగా నిజాయితీగా అర్బన్ బ్యాంకు అభివృద్ధికి పాటుపడాలనే పట్టుదలతో తన వంతుగా ప్రత్యేక కృషి చేస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా జగిత్యాల ప్రాంతంలో రాజేందర్ రావు తండ్రి వెలిచాల జగపతిరావు పేరు తెలియని వారు లేరు. కరీంనగర్ రత్నం బ్యాంకు అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. బ్యాంక్ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. నిజాయితీగా నీతిమంతంగా సేవలందించేలా తన ప్యానల్ ను నాలుగు సార్లు గెలిపించుకున్నారు. గతంలో 1972 నుంచి 1977 వరకు జగిత్యాల ఎమ్మెల్యేగా జగపతిరావు పనిచేశారు. జగపతిరావు ఈ ప్రాంతం అభివృద్ధికి విశేష కృషి చేశారు. నాడు తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్న ప్రజానీకానికి అండగా నిలిచారు. జగిత్యాల నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్తు వెలుగులు అందించిన ఘనత జగపతిరావు గారిదే. ఇండ్లలో దీపాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న పేద ప్రజల ఇండ్లలో కరెంటు వెలుగులు నింపారు. సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయించి గ్రామ గ్రామానా విద్యుత్ సౌకర్యం పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఈ ప్రాంత రైతాంగం సంక్షేమం కోసం కొత్త కొత్త పరిశోధనలు అందించేందుకు దోహదపడేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అప్పటి పాలకులను ఒప్పించి పొలాస వ్యవసాయ క్షేత్రం ఇక్కడ ఏర్పాటు చేయించారు. తద్వారా పొలాస వ్యవసాయ క్షేత్రం ద్వారా పరిశోధనలు కొత్త కొత్త వంగడాల రూపకల్పనకు ఎంతో ధోహదపడుతున్నది. ఈ ప్రాంత రైతాంగం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనీ వెన్నుదన్నుగా నిలిచారు జగపతిరావు. ఇప్పటికీ రైతులు ప్రజల్లో జగపతిరావు పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇప్పటికి ప్రజలు జగపతిరావును గుర్తు చేస్తున్నారంటే ఆయన చేసిన అభివృద్ధి ముద్ర ప్రత్యేకమైనది. జగిత్యాల ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా మార్క్ఫెడ్ సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చారు. అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు ప్రసరించేలా చేశారు. *తండ్రి బాటలో తనయుడు..* అంతేకాకుండా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకొని కుల మతాలకతీతంగా వెలిచాల జగపతిరావు నాయకుడిగా, ప్రజల మనిషిగా.. ప్రజల ఆత్మబంధువుగా ముందుండి రాజకీయాలను నడిపించారు. అప్పటి పాలకులను మెప్పించి ఒప్పించి తన ప్రజల కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మంజూరు చేయించారు. అదేవిధంగా నాడు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఆవిర్భావంలో జగపతిరావు చేసిన కృషి నేడు సత్ఫలితాలను ఇస్తున్నది. బ్యాంక్ అభివృద్ధిలోనూ ప్రత్యేక కృషి ఉంది. నాలుగు సార్లు సొంతంగా ప్యానల్ ను ఏర్పాటు చేసి గెలిపించుకున్న ఘనత జగపతిరావుకి దక్కుతుంది. అదే ఒరవడితో ఆయన కుమారుడు వెలిచాల రాజేందర్ రావు తనదైన శైలిలో అన్ని వర్గాల వారితో మమేకమవు తున్నారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ అండగా ఉంటున్నారు. వారి సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కరీంనగర్ డిసిసి అధ్యక్ష పదవ రేసులోనూ ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు పుష్కరకాలం తర్వాత జరుగుతున్నాయి. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వెలిచాల రాజేందర్ రావ్ ప్రత్యేకంగా ఒక ప్యానల్ ఏర్పాటు చేశారు. నీతిమంతంగా నిజాయితీగా అంకితభావం పట్టుదల సామాజిక చేసే వారిని ఒక ప్యానెల్ గా ఏర్పాటు చేశారు. తన తండ్రి జగపతిరావు బాటలో రాజేందర్రావు నడుస్తున్నారు. తాను ప్రతిపాదించిన ప్యానల్ అభ్యర్థులు విజయం సాధించేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రత్యేక ఒరవడితో ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ ప్యానల్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. తమ బ్యాంకు అభ్యర్థులను ఎందుకు గెలిపించాలనే అవసరం పై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. బ్యాంకు అభివృద్ధికి పాటుపడతారని ఎలాంటి అవినీతికి తావివ్వకుండా కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా తమ ఫ్యానల్ నడిపిస్తుందని, డిపాజిటర్ల నమ్మకాలను వమ్ము చేయరని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడున్న డిపాజిట్లను మూడింతలు పెంచుతామని నాలుగు కొత్త బ్రాంచ్ నుండి ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. చిన్న అవినీతి మరక అంటకుండా బ్యాంకు ను అభివృద్ధి బాటలో నడిపిస్తామని రాజేందర్ రావు చెబుతున్నారు. కరీంనగర్, గంగాధర, జగిత్యాల ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ, తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. *జగిత్యాలలో విస్తృత ప్రచారం..* ఈ నేపథ్యంలో…కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంతో పాటు రోటరీ పార్క్, శ్రీ కాసుగంటి నారాయణరావు కళాశాల మైదానం, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాల్లోని వాకర్స్ అసోసియేషన్ బృందాలను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేకంగా కలిశారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ప్యానల్ అభ్యర్థుల వ్యక్తిత్వం చూసి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. గతంలో అవినీతి ఆరోపణలు ప్రత్యారోపణలు పనులు చేసుకున్న వారే మళ్లీ ఓటర్ల ముందుకు వచ్చి ఓట్లు అడగడం వింతగా ఉందని వారికి వివరించారు. తాము మంచి ప్యానెల్ ఏర్పాటు చేశామని వారిని ఆదరించాలని రాజేందర్ కోరారు. నీతిమంతమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతుతో ఈ నియోజకవర్గ నుంచి నుంచి గాదె కార్తీక్, కూసరి అనిల్ ను తమ ప్యానెల్ లో అవకాశం కల్పించామని వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతు తమకు జగిత్యాల ప్రాంతంలో ఎంతో బలం వచ్చిందనీ, తమ ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ తో పాటు అదనంగా జగిత్యాల ప్రాంత అర్బన్ బ్యాంక్ ఓటర్ల సభ్యుల సహకారంతో తమ ప్యానెల్ ఘన విజయం సాధించి తీరుతుందని రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించారు జగిత్యాల కు చెందిన గాదె కార్తీక్, వేణుగోపాల్ కూసరి అనిల్ కుమార్ తోపాటు తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని వెలి చాల రాజేందర్ రావ్ విజ్ఞప్తి చేశారు.
Leave a Reply