మా నేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 28/

భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణశాఖ అధ్యక్షలు బింగి వెంకటేష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన అర్బన్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (UIDF) ద్వారా టైర్ -3 మున్సిపాలిటీలైన మన కోరుట్ల మరియు మెట్పల్లి మున్సిపాలిటీలకు 37.40 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఫోటోల కి పాలాభిషేకం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, ఇందురి తిరుమల వాసు, సుధవేణి మహేష్, ఇందూరి సత్యం మాట్లాడుతూ గత రెండు రోజులుగా కాంగ్రెస్ మరియు బి.ఆర్.ఎస్ నాయకులు కోరుట్ల మున్సిపల్ కు మంజూరు అయిన నిధులు తమ పార్టీ నేతలే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినరానీ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు ఈ నిధులు పూర్తిగా కేంద్రం నుండి వచ్చినవే అని ఆయన అన్నారు కేంద్రం లో కోరుట్ల నాయకుడు లీడర్ ధర్మపురి అరవింద్ ఉన్నారని కేంద్ర నిధులు అడగకుండానే కోరుట్ల పట్టణానికి వస్తాయని అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు కానీ మా నాయకుడు ధర్మపురి అరవింద్ అడగకుండానే కోరుట్ల కు నవోదయ విద్యాలయాము నియోజకవర్గములో కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారని అన్నారు కాంగ్రెస్ మరియు బి. ఆర్.ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధుల విషయంలో నిలదీయాలని అలాగే కేంద్రం ఇచ్చిన ఈ 37 కోట్ల 40 లక్షలు పట్టణంలో అన్ని వార్డులకు పారదర్శకతతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపెల్లి సాగర్,సీనియర్ నాయకులు రాచమడుగు శ్రీనివాసరావు, గిన్నెల శ్రీకాంత్, పోతుగంటి శ్రీనివాస్ పెండెం గణేష్, obc మోర్చా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరుమండ్ల చరణ్,ఉపాధ్యక్షులు అక్కినపల్లి వెంకటరమణ తోట రాజేశం, ఒళ్ళుజి నగేష్, మైదం సత్యనారాయణ, ఉప్పులూటి రాఘవులు,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సడిగే మహేష్,జక్కుల ప్రవీణ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్లాల నారాయణరెడ్డి,ఓం ప్రకాష్, నేమురి విజయ్,రాదారపు సత్యనారాయణ,గోనె రాజారాం, తోట రాజేశం, బీజేవైఎం అధ్యక్షులు కలాల సాయిచంద్, తోట దుర్గప్రసాద్, బీజేవైఎం ఉపాధ్యక్షులు ధమ్మ సంతోష్,పంబల అజయ్, బల్క ప్రేమ్ సాగర్, మరియు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Leave a Reply