భీమదేవరపల్లి అక్టోబర్ 31మానేటి న్యూస్:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న కొత్తకొండ మల్లారం రోడ్డును మండల అధికారులు శుక్రవారం మరమ్మతులు చేపట్టారు.భారీ వర్షాల వల్ల రోడ్డు తెగిపోయి,గుంతలుగా మారడం తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని,అలాగే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉందని,ప్రజల సౌకర్యార్థం, ప్రజల భద్రత దృష్ట్యా రోడ్డు మరమ్మతులు చేశారు.ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ భారీ వర్షాలతో రహదారి దెబ్బతినడం తో నిత్యం వందలాది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని సిమెంట్, కాంక్రీట్ తో మరమ్మతులు చేపట్టామన్నారు.ఈ సందర్బంగా ప్రజలు, ప్రయాణికులు,వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.