మానేటి న్యూస్ ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 30/
• భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పోటీ చేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి బండి శ్రీనివాస్ డిమాండ్..
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో విద్యార్థినుల మీద అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన విషయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల, అటెండర్ యాకూబ్ పాషాల ఫోన్లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేయాలని భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పోటీ చేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి బండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పోటీ చేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి బండి శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పాఠశాలలో వెలుగు చూసిన అటెండర్ యాకూబ్ పాషా అకృత్యాలు, వికృత చేష్టలకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం గురించి సంవత్సరం క్రితం పాఠశాల విద్యార్థినీలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన కమల దృష్టికి తీసుకెళ్లినా కూడా అతనికి వత్తాసు పలుకుతూ తూతూ మంత్రంగా మందలించి వదిలిపెట్టడం, పైగా ఈ విషయము బయటకు ఎవరికైనా చెబితే టిసీలు ఇచ్చి పంపిస్తానని విద్యార్థులను హెచ్చరించడం అలుసుగా తీసుకున్న అటెండర్ బరితెగించి విద్యార్థినుల వాష్రూముల్లో సీక్రెట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ చేసి ఫుటేజీలతో బ్లాక్ మేళకు పాల్పడం లైంగిక వేధింపులకు పాల్గొనడం పలు అనుమానాలను కలిగిస్తుందని బండి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థినిలు అటెండర్ యాకూబ్ పాషా లైంగికంగా వేధిస్తున్నాడని హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్తే కూడా విద్యార్థినులనే బెదిరించడం ఈ కోణంలో విచారణ చేస్తే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పోలీసులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల, అటెండర్ యాకూబ్ పాషాల ఫోన్లు స్వాధీన పరుచుకొని వారి మధ్య జరిగిన కాల్ లిస్ట్ డాటా వాట్సాప్ డాటా పరిశీలించినట్లయితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, ఆ కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు కొనసాగించాలని ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పోటీ చేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి బండి శ్రీనివాస్ పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు.