X

కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదు… నయవంచన పాలన…!?

ఆరు గ్యారెంటీలు అన్ గ్యారంటీలయ్యాయి..

ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా.

55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా.?

స్థానిక సంస్థల ఎన్నికల కోసం మళ్లీ  డ్రామాలు మొదలుపెట్టింది..

హుజురాబాద్ లో నిర్వహిస్తున్న నేటి బూత్ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి…

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 18/

మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ,  ప్రజా పాలన పేరిట సంబరాలు చేపట్టాలనుకోవడం విడ్డూరంగా ఉందని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ది ముమ్మాటికి నయవంచన  పాలనేనని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి  ఘాటు వ్యాఖ్యలు చేశారు . హుజురాబాద్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బుధవారం రోజున హుజురాబాద్లో తలపెట్టిన  బూత్ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బూత్ అధ్యక్షులు, కార్యదర్శి, సోషల్ మీడియా కన్వీనర్ తప్పకుండా ఈ సమావేశానికి హాజరుకావాలని సూచించారు. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ హాజరవుతారని  తెలిపారు. ముఖ్యంగా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టడానికి, పార్టీ    శ్రేణులను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి  సమావేశంలో తగిన కార్యచరణ రూపొందించడంజరుగుతుందన్నారు.కాంగ్రెస్ రెండేళ్ల  ప్రజా పాలన నయవంచన పాలన  గా మారిందన్నారు. వంద రోజుల్లో పూర్తి చేస్తామన్న ఆరు గ్యారెంటీలు ఆన్ గారంటీలయ్యాయన్నారు. రెండేళ్లలో ఏ ఒక్క గ్యారెంటీని సక్రమంగా అమలు చేయలేకపోయిందని , రేవంత్ రెడ్డి ప్రభుత్వం  మాటల గారడి తో పథకాలన్నింటినీ  అటకెక్కించిందన్నారు . బీసీలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుందన్నారు. బీసీల ఓట్లు దండుకోవడానికి బీసీ  డిక్లరేషన్ పేరిట ప్రకటించిన వాగ్దానాలన్నీ పటాపంచలయ్యాయన్నారు.
ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా చేసి, చేతులు దులుపు కోవాలనుకున్న, నేడు చేతులు కాలే పరిస్థితి ఏర్పడిందన్నారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిన దాఖలాలు లేవని, నేడు బీసీలకు 42% రిజర్వేషన్ పేరిట చేసిన డ్రామాలన్నీ  ఫెయిల్ అయ్యాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం  మళ్లీ  డ్రామాలు మొదలుపెట్టిందనీ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందడానికి కాంగ్రెస్ చేస్తున్న  కుట్రలు, కుతంత్రాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల  కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదని ఆయన ఘాటుగా విమర్శించారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి ,జిల్లా కార్యదర్శి నరసింహ రాజు ,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్ హుజురాబాద్ నియోజకవర్గ మండల అధ్యక్షులు రాముల కుమార్ ,తుర్పాటి రాజు, కొలకాని రాజు ,సంపెల్లి సంపత్ రావు,  బైరెడ్డి రమణారెడ్డి ,బత్తిని నరేష్ ర్యాకం శ్రీనివాస్, జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు కు పరామర్శ..

బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు  మాతృమూర్తి రావుల అనసూయ  అకాల మరణం చెందడంతో మంగళవారం రోజున  ఎలబోతారం గ్రామంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పార్థివ దేహానికి   పూలమాలవేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా గంగాడి వారి  కుటుంబ సభ్యులను పరామర్శించి,  ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు.  పరామర్శించిన వారిలో  బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు  మాజీ కౌన్సిలర్ పైళ్ళ వెంకట్ రెడ్డి బిజెపి సీనియర్ నాయకులు  గంగిశెట్టి ప్రభాకర్  తిప్పబత్తిని రాజు గంట సంపత్ భాస్కర్ యాదవ్ పర్థం రాము తదితరులు ఉన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post