X

కల్వర్టులో పడి వ్యక్తి మృతి..

భీమదేవరపల్లి అక్టోబర్ 30( మానేటి న్యూస్):

మొంథా తుఫాను ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. నాగేంద్రం హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.బుధవారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు. ఈ సమయంలో వర్షం తీవ్రంగా కురుస్తుండడంతో గ్రామ కల్వర్టు జలమయమైంది.దారి కనిపించకపోవడంతో ఆయన బైక్‌తో పాటు కల్వర్ట్ లో పడిపోయి మృతిచెందారు. మృతుడు గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కన్ను కోల్పోయినట్లు సమాచారం.మృతునికి భార్య అనిత,ఇద్దరు కుమారులు ఉన్నారు.మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు ముల్కనూర్ ఎస్‌ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post