
భారత జాతీయ గేయం అయిన “వందేమాతరం” గీతాన్ని మహాకవి బంకించంద్ర ఛటర్జీ రచించి నేటితో (నవంబర్ 7, 2025 నాటికి) 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కరీంనగర్ పోలీసు కమీషనరేట్ కేంద్రంలో ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.కమీషనరేట్ కాన్ఫరెన్స్ హాలునందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు కమీషనర్ గౌష్ ఆలం పాల్గొని, వందేమాతర గేయాన్ని ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా పోలీసు కమీషనర్ గారు మాట్లాడుతూ, వందేమాతర గీతం స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చిందని, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే గొప్ప శక్తి ఈ గీతంలో ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఆర్ ఐ కిరణ్ కుమార్ లతో పాటు కమీషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గేయాన్ని ఆలపించారు.
