మానేటి న్యూస్ కరీంనగర్ డిసెంబర్ 02
కరీంనగర్‌కు చెందిన ప్రముఖ కవులు సబ్బని లక్ష్మీనారాయణ, అన్నవరం దేవేందర్‌లకు నిజామాబాద్ హరిదా రచయితల సంఘం ప్రతిష్ఠాత్మక కవితా పురస్కారం లభించింది. తెలంగాణ భాషలో రచించిన కవిత్వానికి ఈ పురస్కారం ప్రదానం చేయబడడం విశేషం.ఈ పురస్కారాలను డిసెంబర్ 4, 2025న నిజామాబాద్‌లో జరిగే హరిదా సరస్వతీరాజ్ సాహిత్యోత్సవంలో ఘనంగా అందజేయనున్నారు.పురస్కారంలో భాగంగా రూ.1,000 నగదు బహుమతితో పాటు సత్కారం కూడా ఉంటుంది.కరీంనగర్‌కు చెందిన ఈ ఇద్దరు కవులకు పురస్కారం లభించడం పట్ల స్థానిక సాహితీ, సామాజిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా
శ్రీ అరబిందో సొసైటీ అధ్యక్షుడు ప్రముఖ ఇంజనీర్ కోల అన్నారెడ్డి, కార్యదర్శి ఉప్పల రామేశం,
సాయినగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బొజ్జ రాజు, కార్యదర్శి సురేందర్ రెడ్డి,
బొమ్మకల్ రైతు సంఘం నాయకులు కె. నారాయణ రెడ్డి,
శరత్ సాహితీ కళాస్రవంతి కరీంనగర్ కార్యదర్శి సంకేపల్లి నాగేంద్రశర్మ,
రాష్ట్ర శాలివాహన సంఘం నాయకులు ఛత్రపతి శ్రీనివాస్,
అలాగే కరీంనగర్ సాహితీ మిత్రులు ఇద్దరు కవులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.