కోవరాజు సాగర్ మానేటి కమలాపూర్/

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఈరోజు శ్రీరాములపల్లి, మాదన్నపేట, శనిగరం, నేరెళ్ల, పంగిడిపల్లి, మర్రిపల్లిగూడెం, గుండేడు గ్రామాలలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ మాట్లాడుతూ.. “ముందా తుఫాన్ కారణంగా వర్షాల వల్ల తడిసిన ధాన్యం చివరి గింజ వరకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం త్వరితగతిన బోనస్ చెల్లించనుంది. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చూడాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య గౌడ్, IKP APM లలిత, మాజీ సర్పంచ్ గుండపు చరణ్ పటేల్, డైరెక్టర్లు కెత్తే విజయేందర్, చకిలం దయాకర్, యాకూబ్ పాషా, నెగ్గుల లింగయ్య, కాంగ్రెస్ నాయకులు గూడెపు మొగిలయ్య, దూడ శ్రీకాంత్, నాంపల్లి ప్రభాకర ప్రజాపతి, తాటిపాముల రాములు, అబ్బరవేణి అనిల్, బాలపూరి కనకరత్నం, డాక్టర్ విజయేందర్, డాక్టర్ రాజు, సురేందర్ రాజు, ఉపాసి కృష్ణ, ఐకెపి సిబ్బంది, ఎస్‌హెచ్‌జి సభ్యులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.రైతులు ఈ సందర్భంగా ఐకెపి కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలను అభినందించారు.