కాశ్మీర్‌గడ్డ సాయి కృష్ణ టాకీస్ రోడ్డులోని కపిశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మండపంలో మిగిలిన పనులకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్‌రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ సహకారంతో ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు కావడంతో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు. దాతల సహకారంతో మిగిలిన పనులను పూర్తి చేసి కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.ఆలయంలోని ఇతర వ్యవస్థాపన పనులను కూడా త్వరలో పూర్తి చేసి అన్ని సౌకర్యాలతో భక్తుల సేవకు అందజేస్తామన్నారు. నగరంలోని పలు ఆలయాల్లో కమ్యూనిటీ హాల్‌లు నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీదేవి చంద్రమౌళి, ఆలయ కమిటీ సభ్యులు కేశవరెడ్డి, బిట్ల కనకయ్య, శంకరయ్య, ఎల్లయ్య, ముత్తయ్య, శ్రీకాంత్, వెంకటేశ్వరరావు మరియు ఆలయ పూజారి పాల్గొన్నారు.