సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్/
కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ఈ రోజు హైదరాబాద్‌లో ఎంఎల్సీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ బల్మూరి వెంకట్ గారిని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్బంగా మండలంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై నేతలు చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సిద్ధం చేయాలని, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీని మరింత శక్తిమంతం చేయాలని వెంకట్ అన్న సూచించారు.
కమలాపూర్ మండలంలో పార్టీ విస్తరణ, బూత్ స్థాయి బలమైన కమిటీల ఏర్పాటు, యువతను ఎక్కువగా పార్టీలోకి తీసుకురావడం వంటి అంశాలు కూడా చర్చించారు.
నేతల ఆందోళనలు, స్థానిక సమస్యలను తెలుసుకున్న బల్మూరి వెంకట్, త్వరలో మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చే విధంగా హామీ ఇచ్చారు.