X

అర్బన్‌ బ్యాంకును లాభాల బాట పట్టించా- మాజీ ఛైర్మన్, డైరెక్టర్‌ అభ్యర్థి కర్ర రాజశేఖర్‌..

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/

అర్బన్‌ బ్యాంకును లాభాల బాటాపట్టించాను అని ఆ బ్యాంకు మాజీ ఛైర్మన్, డైరెక్టర్‌ అభ్యర్థి కర్ర రాజశేఖర్‌ అన్నారు. నష్టాల్లో ఉన్న బ్యాంకును వందల కోట్ల టర్నోవర్‌కు చేర్చానని, చేసిన పనులే గెలిపిస్తాయని వివరించారు. గురువారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు ఓటమి భయంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి ఓటర్లు మళ్లీ అవకాశం ఇస్తే బ్యాంకును రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతాయనన్నారు. తన ప్యానెల్‌ను గెలిపించాలని కోరారు. సమావేశంలో డైరెక్టర్‌ అభ్యర్థులు ఎడబోయిన శ్రీనివాస్‌రెడ్డి, తాటికొండ భాస్కర్, తాడ వీరారెడ్డి, దేశ వేదాద్రి, బండి ప్రశాంత్‌దీపక్, బాశెట్టి కిషన్, బొమ్మరాతి సాయికృష్ణ, యం.డి.షమీయొద్దీన్, ముద్దసాని క్రాంతి, వరాల జ్యోతి, సరిళ్ల రతన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post