
బహిరంగ సభలో తెలియజేయాలి….
హుస్నాబాద్, డిసెంబర్ 2, (మానేటి న్యూస్ ):
గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిపినప్పుడు అంబేద్కర్ సాక్షిగా ఆరోజు అతిరథ మహారథులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మంత్రులుగా ఉన్నవారు అధికారం రాగానే హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని చెప్పినారు.
కాబట్టి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలయింది అయినా కూడా కరీంనగర్ జిల్లాలో కలపడంలో పూర్తిగా నిర్లక్ష్యం జరిపినారు కాబట్టి
ఈ ప్రజా పాలన రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజాఉత్సవాల సందర్భంగా బహిరంగ సభ యందే ఏ రోజు కలుపుతారు అనేది తెలియజేయాలి.
గతంలో ఈ ప్రాంత వాసులు సిద్దిపేటలో కలిపినప్పుడు అన్ని పార్టీలను కలుపుకొని ప్రజా ఉద్యమము అమర నిరాహార దీక్షలు జరిపారో అలాంటిది మళ్లీ పునరావృతం అవుతుందని తెలియజేస్తున్నాము.
అఖిలపక్ష పార్టీల నాయకులు
హుస్నాబాద్ నియోజకవర్గం.