అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం బిఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధి శూన్యం టిపిసిసి ఉపాధ్యక్షులు నవాబ్ ముజాహిద్ అలంఖాన్..

సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 28/

హైదరాబాద్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని టిపిసిసి ఉపాధ్యక్షుడు నవాబ్ ముజాహిద్ అలంఖాన్ అన్నారు. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలకు రూ.2,780కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మంగళవారం బర్కతప్పురలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతా ఉన్న పట్టణాలను ‘గ్రోత్ హబ్’లుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారని ఆయన తెలిపారు. పట్టణాభివృద్ధిలో భాగంగా మౌళిక వసతుల కల్పన, కాలుష్య నియంత్రణ, పౌర సేవలు మెరుగురచడం వంటి వాటికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు. అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు, కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, ప్రధాన కూడళ్ళ అభివృద్ధి, పార్కుల సుందరీకరణ వంటి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *