సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్/
మెంథా తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించారు.
ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ, “మెంథా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోసిన పంటలు – ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న – పూర్తిగా తడిసి నష్టపోయాయి. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి,” అని కోరారు. అలాగే పాడి మ్యాచర్ సమయాన్ని నవంబర్ 17 నుండి 25 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పెండ్యాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండి కోటేశ్వర్, మాజీ జెడ్పీటీసీ వలిగే సాంబారావు, జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు, మాజీ మండల అధ్యక్షుడు కట్కూరి అశోక్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్, ఉపాధ్యక్షులు భోగి బిక్షపతి, జెట్టి సారంగపాణి, చెరుపల్లి రతన్, నాసాని రాజు, సముద్రాల మొగిలి, ఆకినపల్లి రవీందర్, పెండ్యాల తిరుపతిరెడ్డి, చేరాల రాంబాబు, వెలగం రాజు, గోల్కొండ శ్రీకాంత్, ఇనుదాల రవి, బేతీ మల్లయ్య, లకిడి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
👉 రైతుల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని ర్యాకం శ్రీనివాస్ స్పష్టం చేశారు.